Sharmila కాళేశ్వరం కోసం అప్పుల తెస్తున్న కేసీఆర్.. రైతులను మాత్రం పట్టించుకోవడం లేదు: షర్మిల
Sharmila Fire on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణాలో భారీ వర్షాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందన్న షర్మిల.. కేసీఆర్ ప్రాజెక్ట్ పునరుద్దరణ కోసం అప్పులు తీసుకొస్తున్నారని, కానీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు మాత్రం ముందుకు రావడంలేదన్నారు. భారీ వర్షాలకు, వరదలకు లక్షల ఎకరాల్లో రైతులకు పంట నష్టం వాటిల్లిందన్నారు. కేసీఆర్ మాత్రం రైతులను పట్టించుకున్న దాఖులాలు లేవన్నారు.
మరోవైపు వరదలతో ఇళ్లు మునిగిపోయి, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులకు టీఆర్‌ఎస్ సర్కార్ ఎలాంటి సహాయం చేయలేదన్నారు. బాధితులకు సీఎం కేసీఆర్ 10 వేలు సాహాయం అందిస్తామని హామి ఇచ్చారన్న షర్మిల.. కేసీఆర్ మాట ఇచ్చి నెల కావొస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా చెల్లించలేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి నష్టపోయిన రైతులను ఆదుకోవడం చేతకాదని, వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడం చేతకాదని విమర్శించారు. కేసీఆర్ వల్ల రాష్ట్రానికి ఏమి ఉపయోగం అంటూ ఆమె ఎద్దేవా చేశారు.