Minister Harish Rao: డెంగ్యూ వ్యాధిని నివారించేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి: మంత్రి హరీష్ రావు
Minister Harish Rao’s Instructions on Seasonal Diseases: సీజనల్ వ్యాధులు ప్రభలుతుండటంతో ప్రతీ ఒక్కరు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని మంత్రి తెలిపారు. డెంగ్యూ నివారణలో భాగంగా.. హరీష్ రావు తన నివాస ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్రపరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు.
సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందని, దాంతో పాటు ప్రమాదకర డెంగ్యూ వ్యాధిని దోమలు వ్యాప్తి చేస్తాయని ప్రజలు రోగాల భారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీరును తొలగించాలని, వర్షపు నీరును ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. డెంగ్యూ వ్యాధిని నివారించేందుకు ప్రజలంతా ప్రతి ఆదివారం పది నిముషాలు కేటాయించి వారి ఇంటి చుట్టూ ఉన్న చెత్తా, చెదారం, నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు