Google Maps : స్ట్రీట్ వ్యూ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలంటే?
How to use Google Maps Street View feature : నావిగేటింగ్‌ను మరింత మెరుగ్గా చేయడానికి, వర్చువల్‌గా అన్వేషించడంలో సహాయపడే విధంగా Google భారతదేశంలో స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణే, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్, అమృత్‌సర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 2022 చివరి నాటికి దేశంలోని మరో 50 నగరాలకు అందుబాటులోకి వస్తుంది.
Google మ్యాప్‌ను నావిగేట్ చేయడం ఈరోజుల్లో సాధారణ విషయమే. అయితే స్ట్రీట్ వ్యూ మ్యాప్స్ ల్లో ప్రతీ విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. ఇది వినియోగదారులు ప్రపంచంలోని మరొక ప్రాంతంలో ఉన్నప్పుడు పరిసర ప్రాంతాలను అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది. యాప్ వీధులకు సంబంధించి పూర్తిగా 360-డిగ్రీ వ్యూను అందిస్తుంది. Google Genesys International, మ్యాపింగ్ సొల్యూషన్స్ కంపెనీ, టెక్ మహీంద్రా భాగస్వామ్యంతో ఈ ఫీచర్‌ను ప్రారంభించింది.
మరి Google మ్యాప్స్‌లో స్ట్రీట్ వ్యూను ఎలా ఉపయోగించాలంటే ?
మీ ఫోన్‌లోని గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి.
పైన కుడి వైపున ఉన్న డైమండ్ ఆకారపు మ్యాప్ రకం చిహ్నంపై క్లిక్ చేయండి.
ఇతర మ్యాప్ రకాలను నిలిపివేయండి. స్ట్రీట్ వ్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
సెర్చ్ ఆప్షన్ కు తిరిగి వెళ్లి, మీరు చూడాలనుకుంటున్న స్థానాన్ని టైప్ చేయండి
దిశలపై క్లిక్ చేయండి. అంతే రూట్ మ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది
కింద ప్రారంభ ప్యానెల్ పైకి స్లైడ్ చేయండి. మీకు రూట్ కన్పిస్తుంది.
క్రిందికి స్క్రోల్ చేస్తే రూట్ పక్కన చిన్న ఫోటోలు కన్పిస్తాయి.
మీకు కావాల్సిన వీధిని 360 డిగ్రీల వ్యూతో చూడడానికి దానిపై క్లిక్ చేసి, మీ వేలిని వివిధ కోణాల్లోకి తిప్పండి.
ఇక ఎడమ వైపు స్లైడ్ చేసి, మరింత ముందుకు వెళ్లడానికి రూట్ ను మార్చండి.