Caneriya: విరాట్ కోహ్లీపై మాక్ మాజీ క్రికెటర్ ఆసక్తిర వ్యాఖ్యలు
Danish Caneriya Comments on Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సెంచరీ సాధించి మూడు సంవత్సరాలు దాటింది. ఐపీఎల్‌లో నిరాశపరిచిన కోహ్లీ.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలోనూ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఇక ఇంగ్లండ్ టూర్ తర్వాత కోహ్లి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే జింబాబ్వే పర్యటనకు కోహ్లిని ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ జింబాబ్వే సిరీస్‌కు కోహ్లిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
కోహ్లిపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కీలక వాఖ్యలు చేశాడు. ఆసియాకప్-2022కు విరాట్ కోహ్లిని ఎంపికచేయకపోవచ్చు అని కనేరియా జోస్యం చెప్పాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కు బదులుగా కోహ్లిని ఎంపిక చేయాల్సిందని కనేరియా అన్నాడు. కానీ జింబాబ్వే సిరీస్‌కు ఇషాన్ కిషన్‌ను ఎందుకు ఎంపిక చేశారో తనకు అర్ధం కావడం లేదన్నాడు. జట్టులో మరో వికెట్ కీపర్‌గా ఉన్న సంజూ శాంసన్ అద్భుతంగా రాణిస్తున్న సమయంలో కిషన్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం ఏముందని, అతనికి బదులుగా కోహ్లి జట్టులో ఉండాల్సిందన్నాడు. విరాట్ కోహ్లి ఈ సిరీస్‌లో భాగమై ఉంటే బాగుండేది. కోహ్లిని కేవలం ప్రధాన టోర్నమెంట్లలో మాత్రమే ఆడాంచాలని బీసీసీఐ భావిస్తోందన్నాడు
జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేయకుండా బీసీసీఐ కోహ్లికి అన్యాయం చేస్తుందన్నాడు. కోహ్లి వెస్టిండీస్ పర్యటన మొత్తానికి విశ్రాంతి తీసుకున్నప్పుడు, అతడిని ఖచ్చితంగా జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేయాల్సిందన్న ఈ పాక్ మాజీ స్పిన్నర్.. అతడు జింబాబ్వేతో వన్డేల్లో రాణించి తన ఫామ్‌ను తిరిగి పొందేవాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. తద్వారా ఆసియా కప్‌లో కూడా కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేసేవాడన్నాడు. ఐతే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే విరాట్ కోహ్లీని ఆసియా కప్‌కు కూడా పక్కన పెట్టే అవకాశం ఉందన్నాడు.