LPG Cylinder Price: బిగ్ రిలీఫ్.. తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర
Commercial Cylinder Price Reduction: వినియోగదారులకు చమురు సంస్థలు బిగ్ రిలీఫ్‌ని ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే ఇవాళ్టి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 36 రూపాయలు తగ్గింది. నెల వ్యవధిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. జూలై 6న 19 కేజీల సిలిండర్‌పై 8.50 రూపాయలు తగ్గించాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 1,976 రూపాయలుగా ఉండగా అంతకు ముందు 2,012 రూపాయలుగా ఉండేది. కోల్‌కతాలో ఈ ధర 2,095 రూపాయలుగా, ముంబైలో 1,936 రూపాయలుగా, చెన్నైలో 2,141 రూపాయలుగా ఉంది. కాగా స్థానిక టాక్స్‌ల ఆధారంగా వివిధ రాష్ట్రాలకు ఈ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
ఇప్పటికే నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు గతంలో చమురు సంస్థలు పదే పదే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంతో ప్రజలపై భారం ఎక్కువైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించగా.. ప్రస్తుతం చమురు సంస్థలు కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించాయి.