India Corona: దేశంలో కొనసాతున్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా నమోదైన కేసులెన్నంటే ?
India Corona Update: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా ఆదివారం 2 లక్షల 73 వేల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16 వేల 464 మందికి ఈ వైరస్ సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం కంటే ఆదివారం రోజు మూడున్నర వేల మేర కేసులు తగ్గినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 38 మంది కోవిడ్‌తో మరణించారని తెలిపింది. నిన్న ఒక్క రోజే 16 వేల 112 మంది కరోనా నుంచి కొలుకున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు దేశంలో క్రియాశీల కేసులు లక్ష 43 వేల 989కి చేరాయి. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు 4.4 కోట్ల మందికి కరోనా సోకగా.. 98.48 శాతం మంది వైరస్ నుంచి కొలుకున్నారు. మరో 5.26 లక్షల మంది కరోనాతో పోరాడి మరణించారు. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 8 లక్షల 34 మందికి టీకా వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 204 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా బూస్టర్ డోసును సైతం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు