AICC : దేశవ్యాప్తంగా ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు
Nationwide agitation of Congress on 5th August : ఆగస్టు 5న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టనుంది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఆగస్టు 5న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించనుంది. రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ భవన్ వరకు ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించింది ఏఐసీసీ. ఈ మేరకు ఆందోళనల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఉదయం రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్ర చేయనున్నారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నివాసాన్ని ముట్టడించనున్నారు. ఈ నిరసనలో సీనియర్ నేతలు, కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమయంలో రాష్ట్ర రాజధానుల్లోని గవర్నర్ల నివాసాలు కూడా ఘెరావ్ అవుతాయి. రాజ్‌భవన్ దిగ్బంధంలో సీనియర్ నేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు పాల్గొంటారు.
అలాగే మండల, బ్లాక్, జిల్లా స్థాయిల్లో ఆందోళనలు నిర్వహించి నాయకులను, ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించాలని పీసీసీ హైకమాండ్ ఆదేశించింది. అధ్యక్షులు, A.I.C.C. అనుబంధ సంస్థల ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, నాయకులకు సూచనలు చేశారు. కొంతమంది నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ప్రధాని నివాసాన్ని ముట్టడించడంతో పాటు కాంగ్రెస్ బంద్‌కు పూనుకున్నట్లు తెలుస్తోంది.
జిల్లాల స్థాయిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని, కలెక్టరేట్ ల ముట్టడి, రాష్ట్ర రాజధానుల్లో పిసిసి ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు దేశ రాజధానిలో చలో రాష్ట్రపతి భవన్ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు.