First Monekeypox death: భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం
భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం సంభవించింది. కేరళలో త్రిస్సూర్‌కి చెందిన 22 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ కారణంగా మరణించాడు. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని వెల్లడించారు. వేరే దేశంలో ఉన్న సమయంలో మంకీపాక్స్ సోకిన ఈ యువకుడు భారతదేశానికి తిరిగి వచ్చాడు.
BREAKING: India confirms its first monkeypox case death
— Monkeypoxtally (@Monkeypoxtally) July 31, 2022
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కారణంగా 9 మంది చనిపోయారు. ఇటీవలే బ్రెజిల్‌లో ఓ వ్యక్తి మంకీపాక్స్ బారిన పడి మరణించాడు. ఆ దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేవలం రెండు రోజుల్లోనే 281 మందికి కొత్తగా మంకీపాక్స్ వ్యాపించింది. 29 శాతం పెరిగింది. స్పెయిన్ దేశంలో కూడా రెండు మంకీపాక్స్ మరణాలు సంభవించాయి.
🔴 2nd #Monkeypox death in #Spain🇪🇸 taking the toll to 8 in 2022https://t.co/12xrZNWYIM pic.twitter.com/5nPR8338tu
— Vinod Scaria (@vinodscaria) July 30, 2022