Sanjay Raut: శివసేన నేత సంజయ్ రౌత్ అరెస్ట్
Patra Chawl Land Scam Case: శివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. పత్రాచల్ భూ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు లో సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో విచారించిన అధికారులు సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటివద్ద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు తనను తీసుకెళ్లే సమయంలో ఇంటికి వచ్చిన శివసేన కార్యకర్తల వైపు చూసి రౌత్ అభివాదం చేశారు
సంజయ్ రౌత్ అరెస్ట్ వార్తలు కలకలం రేపడంతో శివసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. సంజయ్ రౌత్‌కు మద్దతుగా, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదర్ ప్రాంతంలోని వర్ష రౌత్‌కు చెందిన ఓ ఫ్లాట్ ఆమెకు, స్వప్న పట్కర్‌కు ఉమ్మడిగా అలీబాగ్‌లోని కిహిం బీచ్ వద్ద ఉన్న ఎనిమిది స్థలాలను జప్తు చేసింది. సంజయ్ రౌత్‌కు అత్యంత సన్నిహితుడైన సుజిత్ పట్కర్ భార్య స్వప్న పట్కర్. ప్రవీణ్ రౌత్, సుజిత్ పట్కర్‌లతోగల సన్నిహిత వ్యాపార, ఇతర అనుబంధం గురించి సంజయ్ రౌత్‌ను అధికారులు ప్రశ్నించనున్నారు. సంజయ్ రౌత్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని కేసులకు భయపడేది లేదు. బీజేపీ ప్రభుత్వం నాపై చేసే కుట్ర ఇది అని ఆరోపించాడు.