West Bengal: కరెంట్ షాక్‌తో 10 మంది మృతి.. ఎక్కడంటే
Generator Causing Electric Shock పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‍బిహార్‌లో దారుణం జరిగింది. పికప్ వ్యాన్ విద్యుదాఘాతానికి గురై అందులో ప్రయాణిస్తున్న 10 మంది మృతి చెందారు. వ్యాను జల్పేష్ వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులు తెలిపారు. 27 మందితో వెళ్తున్న వ్యాను వెనుకాల ఏర్పాటు చేసిన డీజే జనరేటర్ తీగల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చిన అధికారులు ప్రథమికంగా అంచనా వేస్తున్నారు.
వ్యాన్ మొత్తానికి ఒక్కసారిగా కరెంట్ షాక్ రాగా అందులో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారని, మరో 16 మంది విద్యుత్ షాక్ కొడుతున్న సమయంలో వాన్‌లో నుంచి బయటకు దూకినట్లు తెలిపారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు క్షతగాత్రుల ఆరోగ్యం నికడగా ఉన్నట్లు తెలిపారు. ఐతే ప్రమాదానికి అసలు కారణం డీజే జనరేటర్ వైరే కారణమా లేక వ్యాన్‌పై విద్యుత్ తీగలు తెగిపడ్డాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.