Monkeypox: అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న మంకీపాక్స్
Monkeypox in America: అగ్రరాజ్యం అమెరికాలో మంకీపాక్స్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ నగరం ఈ మహమ్మారికి కేంద్రంగా నిలిచింది. ఈ మేరకు అక్కడి అధికారులు తెలిపారు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్, హైజీన్ కమిషనర్ అశ్విన్ వాసన్ ముందస్తుగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు త్వరితగతిన వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధించిన అధికారులు అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ విస్తరించే అవకాశం ఉందని కొన్ని రోజుల క్రీతమే ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రస్తుతం మంకీపాక్స్ 75 దేశాలకు విస్తరించగా.. ప్రపంచ వ్యాప్తంగా 16 వేల కేసులు నమోదయ్యాయి.