Chinese rocket: భూమి వైపు వస్తున్న చైనా రాకెట్ భాగాలు
Longmarch 5B rocket fragments: చైనాకు చెందిన లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్‌కు చెందిన భారీ శకలాలు భూమివైపు వస్తున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. ప్రజలు వీటిని ఉల్కాపాతంగా భావించి వీడియోలు తీసినట్లు తెలిపారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో హిందూ మహాసముద్రంపై ఇవి భూమివైపు వస్తున్నట్లు గుర్తించామన్నారు. ముఖ్యంగా ఈ రాకెట్ భాగాలు భారత ఉపఖండం వైపు వస్తుండొచ్చని భావించారు.
తూర్పు, దక్షిణాసియా ప్రాంతాల్లోని చాలా చోట్ల ప్రజలు వీటిని వీక్షించారని నాసాకు చెందిన శాస్త్రవేత్తలు వెళ్లడించారు. మలేషియా మీదుగా ఈ శకలాలు వస్తున్నట్లు నాసా ఆస్ట్రోనాట్ క్రిస్ హాడ్‌ఫీల్డ్ కూడా షేర్ చేశారు. వీటిలో ఎన్ని భూమిని తాకి ఉండొచ్చనే సందేహం వ్యక్తం చేశారు. మరోవైపు చైనా స్పేస్ ఏజెన్సీ పనితీరును నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నిల్సన్ తప్పుపట్టారు. చైనా తన రాకెట్ల శిథిలాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకోలేకపోతోందని పేర్కొన్నారు. అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించే దేశాలు అత్యుత్తమ విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. మరోవైపు చైనా ఇటీవల లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్‌ను ప్రయోగించింది. ఇది అంతరిక్షంలో నిర్మించతలపెట్టిన స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన ల్యాబరేటరీ మాడ్యూల్‌ను తరలించింది.