PWCF: బిన్ లాడెన్ కుటుంబ సభ్యుల నుంచి ప్రిన్స్ చార్లెస్ ట్రస్టుకు భారీ విరాళం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ది సండే టైమ్స్ ఓ సంచలన కథనం ప్రచురించింది. బ్రిటన్ రాజవంశ వారసుడు ప్రిన్స్ ఛార్లెస్, ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి భారీ విరాళం తీసుకున్నట్లు కథనంలో పేర్కొంది. చార్లెస్‌కు చెందిన చారిటబుల్ ట్రస్ట్ లో ఒక మిలియన్ పౌండ్లు జమ అయినట్లు సండే టైమ్స్ తెలిపింది. భారత కరెన్సీ ప్రకారం ఈ మొత్తం 9.6 కోట్లు. బిన్ లాడెన్ సోదరులు బకర్ బిన్ లాడెన్, షఫీక్ బిన్ లాడెన్‌ల నుంచి ప్రిన్స్ భారీ విరాళం తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సండే టైమ్స్ కథనం ప్రకారం 2013లో ప్రిన్స్ చార్లెస్, బిన్ లాడెన్ సవతి సోదరుడు బకర్‌ను కలిసినట్లు విరాళం స్వీకరించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. 2013 అక్టోబర్ 30న వీరిద్దరూ లండన్‌లోని క్లారెన్స్ హౌస్‌లో కలిశారని కూడా సండేటైమ్స్ వెల్లడించింది.
చార్లెస్ సలహాదారుల్లో చాలా మంది ఈ విరాళాన్ని తిరసర్కరించాలని కోరినా దానికి ఆయన అంగీకరించలేదు. విరాళాన్ని స్వీకరించడానికే మొగ్గు చూపాడు. ట్రస్టీల అనుమతితోనే విరాళం స్వీకరించడం జరిగిందని PWCF వెల్లడించింది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చారిటబుల్ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ఉన్న సర్ ఇయాన్ చెషైర్ ఈ విషయమై స్పష్టత నిచ్చారు. ట్రస్టీలందరూ జాగ్రత్తగా పరిశీలించిన అనంతరమే విరాళం స్వీకరించడం జరిగిందని తెలిపారు.
What did Osama Bin Laden’s family get for £1m cash given to Prince Charles? It was 2013 – 2 yrs after Osama’s death/12 yrs after 9/11
No question he shouldn’t have taken it, knew it & did it anyway. Shameful & lacking good judgment bringing Royal Family/UK into disrepute
So why pic.twitter.com/85CKknFfjt
— Dr Shola Mos-Shogbamimu (@SholaMos1) July 30, 2022