Nepal: నేపాల్‌లో తీవ్ర భూకంపం
Nepal Earthquake : ఆదివారం ఉదయం నేపాల్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (NEMRC) ప్రకారం, నేపాల్‌లోని ఖాట్మండుకు 147 కి.మీ ESE దూరంలో ఖోటాంగ్ జిల్లా మార్టిమ్ బిర్టా చుట్టూ ఉదయం 8.13 నిమిషాలకి భూకంపం సంభవించింది.
భూకంప కేంద్రం యొక్క లోతు తూర్పు నేపాల్‌లో 10 కి.మీ వద్ద ఏర్పడింది, 27.14 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 86.67 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉన్నట్లు నిర్దారించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భూకంపాలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి, అటువంటి విపత్తుల నిర్వహణకు విధానపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏప్రిల్ 25, 2015న రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం సెంట్రల్ నేపాల్ రాజధాని ఖాట్మండు మరియు పోఖారా నగరాల మధ్య సంభవించింది. దీని వల్ల 8,964 మంది మరణించారు మరియు 22,000 మంది గాయపడినట్లు అంచనా వేశారు.
గోర్ఖా భూకంపం అని పిలువబడే ఈ భూకంపం ఉత్తర భారతదేశంలోని అనేక నగరాలను కూడా కదిలించింది మరియు లాహోర్, పాకిస్తాన్, టిబెట్‌లోని లాసా మరియు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కూడా ప్రకంపనలు సంభవించాయి.భూకంపం కారణంగా ఖాట్మండులోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు.