Minister Sabita Indra Reddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
Tension at Minister Sabita Indra Reddy’s house విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. విద్యార్థులు తమ సమస్యలపై ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల విద్యార్థులు క్యాంపస్‌లో ధర్నా చేస్తున్న సమయంలో క్యాంపస్‌కు వెళ్లిన మంత్రి.. విద్యార్థుల సమస్యలు తీర్చుతానని చెప్పి తప్పించుకున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యలపై లేదన్నారు. తమ పిల్లలు గత రెండు రోజుల నుంచి అన్నం తినడంలేదని వారు వాపోయారు.
కాగా ఫేరెంట్స్ ఒక్కసారిగా శ్రీనగర్‌లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్దకు రావడంతో అప్రత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా విద్యార్థుల తల్లిదండ్రులు శాంతిచలేదు. పోలీసులు చెప్పేవి వినిపించుకోకుండా మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పటికే మంత్రి ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నంచడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.