Road Accident: అర్థరాత్రి రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి
Shamshabad Road Accident: హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్‌లో ఆదివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డు నుంచి వస్తున్నకారు అదుపుతప్పి డివైడర్‌ను ఢి కొంది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతురాలు టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఫిరోజ్‌ఖాన్ కుమార్తె తానియాగా గుర్తించారు. తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న తానియా అర్థరాత్రి శంషాబాద్‌కు ఎందుకు వెళ్లింది. తన ఫ్రెండ్స్‌ను ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయడానికి వెళ్లిందా లేక ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా బయటకు వెళ్లిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.. ఇందుకోసం సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో మహిళలు మద్యం సేవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.