Ramgopal Varma: ఓటీటీల వల్ల థియేటర్లకు ఎలాంటి సంబంధంలేదు.. ఘాటుగా స్పందించిన డైరెక్టర్
Ramgopal Varma responded to OTT: సినీ థియేటర్లకు ఓటీటీలతో నష్టం కలుగుతోందన్నచర్చలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చర్చను మూగ రోదనగా ఆయన అభివర్ణించారు. కరోనా విపత్తు వచ్చిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌ల విస్తరణతో.. సినిమాలు చూసేందుకు థియేటర్లకు వచ్చే వారు తగ్గిపోయారన్న వాదన నెలకొందని, ఇది సినిమా థియేటర్ల వ్యాపారాన్ని దెబ్బతీసిందని, ప్రజలు సినిమా చూసేందుకు థియేటర్లకు రావాలనుకోవడం లేదని గత కొన్ని నెలలుగా చర్చ నడుస్తోంది.
దీనిపై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. దీన్ని డంబ్‌గా ఆయన అభివర్ణించారు. ఈ చర్చ అర్థం, పర్థం లేనిదిగా ఆయన పేర్కొన్నారు. హోటల్స్ పరిశ్రమను ఇక్కడ ప్రస్తావించారు. “కావాల్సిన ఫుడ్‌ను ఇంటి వద్దే పొందగలరు కాబట్టి ఎవరూ హోటల్స్, రెస్టారెంట్లకు రారు అన్నట్టుగానే ఉంది” అని వర్మ ట్వీట్ చేశారు. కరోనా వచ్చిన తర్వాత నుంచి చాలా మంది థియేటర్లకు వెళ్లడం లేదు. కరోనా భయం ఓ కారణం కాగా అదే సమయంలో ఓటీటీలు అందుబాటులోకి రావడంతో చాలా సినిమాలు ఓటీటీల్లో విడుదలౌతున్నాయి. దీంతో అభిమానులు ఓటీటీలకే అలవాటు పడ్డారు.