Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
Heavy Rain in Hyderabad:హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి.. సాయంత్రం కాగానే వర్షం పడుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన వాన దాదాపుగా రెండు గంటలకు పైగా కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లిలో భారీ వర్షం పడింది.బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్‌పేట,ఎల్ బి నగర్ లో విపరీతంగా వర్షం పడింది.
వరద నీటితో.. రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వరద రోడ్ల మీద భారీగా చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాలతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. భారీ వర్షంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.