Hyderabad:హైదరాబాద్ మాదాపూర్ లో కాల్పులు ఒకరి మృతి
Hyderabad Gun Fire: హైదరాబాద్ లో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. అదేదో సినిమాలో చెప్పినట్లుగా వందమందిలొ 10 మందిదగ్గర ఈ గన్ మాత్రమే మాట్లాడుతుంటుంది. హైద్రాబాద్ లో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది రియల్ ఎస్టేట్ ముఠాల మధ్య గొడవల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మాదాపూర్ నుంచి కార్లో వస్తున్న ఇస్మాయిల్ అనే వ్యాపారిపై ప్రత్యర్ధులు కాల్పులకు తెగబడ్డారు.
జూబ్లీహిల్స్ ప్రాంతంలోని హైటేక్ సిటీ వెళ్లే మార్గంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల జైలు నుంచి విడుదలైన పాత నేరస్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముజాహిద్దీన్, తాజుద్దీన్‌తో పాటు మరో నిందితుడు కాల్పులకు తెగబడినట్లు అనుమానిస్తున్నారు.మొత్తం ఆరు రౌండ్లు కాల్పులకు పాల్పడినట్లు గుర్తించారు. హత్య జరిగిన ఘటనా స్థలంలో మొత్తం ఐదుగురు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి గొడవలే కాల్పులకు కారణమని తెలుస్తోంది. మృతి చెందిన ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.