Charminar Birthday: చారిత్రాత్మక కట్టడానికి 444 ఏళ్లు
హైదరాబాద్ పేరు వినగానే చాలా మందికి చార్మినార్ కట్టడం గుర్తుకువస్తుంది. హైదరాబాద్‌కీ, చార్మినార్‌కి అంత అవినాభావ సంబంధం ఉంది. అటువంటి చార్మినార్ నేడు 444వ పుట్టినరోజు జరుపుకుంటోంది. సరిగ్గా ఇదే రోజున 444 సంవత్సరాల క్రితం చార్మినార్‌ను ప్రజల సందర్శనార్ధం ప్రారంభించారు. చార్మినార్‌ను మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. ముస్లింలు వాడే హిజ్రా క్యాలెండర్ ప్రకారం 01.01.1000 తేదీన చార్మినార్‌ను ప్రారంభించారు.
హైదరాబాద్‌లో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో కులీ కుతుబ్ షా చార్మినార్‌ను కట్టించాడు. చార్ అంటే నాలుగు. మినార్ అంటే టవర్. నగరం నడిబొడ్డున నిర్మించిన ఈ కట్టడానికి తర్వాతర్వాత మెరుగులు దిద్దారు. 1889లో లండన్ నుంచి తెప్పించిన పెద్ద పెద్ద గడియారాలను చార్మినార్‌కు నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో నిర్మించిన మొట్ట మొదటి బహుళ అంతస్థుల కట్టడం కూడా చార్మినారే కావడం విశేషం.
చార్మినార్ 444వ పుట్టిన రోజును పురస్కరించుకుని అనేక మంది ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. గతంలో చార్మినార్ ప్రాంతం వద్ద దిగిన ఫోటోలను ట్వీట్ చేస్తున్నారు. చార్మినార్‌కు హ్యాపీ బర్త్ డే చెబుతున్నారు. మరికిందరు చార్మినార్ గురించి తమకు తెలిసిన విషయాలను వెల్లడిస్తున్నారు. చార్మినార్‌కు నాలుగు వైపుల నుంచి తీసిన ఫోటోలను జత చేస్తున్నారు.
Fact 8 –
The structure is made of granite, limestone, mortar, and pulverised marble, weighing approx 14,000 tones apiece. Initially the monument was so proportionately planned that when the fort first opened, one could see all four corners of the bustling city of Hyderabad. https://t.co/jbruRdBtlx pic.twitter.com/Z32bDh60no
— Charminar (@CharminarofHYD) July 31, 2022