Suman: సినిమా షూటింగ్ ల బంద్ నిర్ణయం సరికాదు సుమన్
suman on tollywood producers’ decision on strike. ఈరోజు నుండి సినిమా షూటింగ్స్ ఆగిపోనున్నాయి. ఉదయం నుండి ఏ సెట్లో లైట్ వెలగలేదు. కెమెరా ఆన్ కాలేదు, ట్రాలీ నడవలేదుప్రస్తుత పరిస్థితులలో సినిమా షూటింగ్స్ కి గడ్డు కాలం ఎదురవుతుందనే చెప్పాలి. చాలా మంది కార్మికులు స్టూడియోల వద్ద కి వచ్చి వెయిట్ చేస్తున్నారు.ఈ తరుణంలో సినిమా షూటింగ్ ల బంద్ నిర్ణయం సరికాదని సీనియర్ నటుడు సుమన్ అన్నారు.
ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయం మీద తన అసహనాన్ని ప్రదర్శించాడు సుమన్. ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఫిల్మ్ ఛాంబర్ కలిసి షూటింగ్‌లు బంద్ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి షూటింగ్‌లు జరగబోవని ప్రకటించారు. అన్ని సమస్యల మీద పరిష్కరించుకున్నాకే షూటింగ్‌లు మొదలవుతాయని అది ఎప్పుడనేది త్వరలోనే చెబుతామన్నారు.
హీరోల రెన్యుమరేషన్‌పై వివాదం అనవసరమని అన్నాడు. రెన్యూమరేషన్ తగ్గించుకోవాలనడం సబబు కాదు … ఇండస్ట్రీలో మా ఫ్యామిలీస్ అని చెప్పుకు తిరిగేవారు చాల మంది ఉన్నారు వాళ్ల హీరోలను తగ్గించకోమని అడగాలని కానీ ఇలా అందరి హీరోల రెమ్యునరేషన్ పై మాట్లాడడం సబబు కాదని అన్నాడు.
బంద్‌తో ఓటీటీలకు వాటిల్లే నష్టం ఏమీ లేదన్నాడు. మంచి కంటెంట్ లతో సినిమా వస్తే థియేర్లలోనూ ఆదరిస్తున్నారన్నాడు. ఓటీటీ సినిమాల సెన్సార్‌పై దృష్టి సారించాలని సుమన్ సూచించాడు. షూటింగ్‌ల సమయాన్ని ప్రొడ్యూసర్లు పెంచుకోవాలి … అవసరం మేరకే కాల్షీట్లు తీసుకోవాలని సూచించారు. బయ్యర్లకు నష్టం లేకుండా చూసుకోవాలని సలహా ఇచ్చాడు. తమళినాడులో తన సినిమాలకు వరుసగా నష్టాలు వస్తే రజనీకాంత్ రెన్యూమరేషన్ తిరిగి ఇచ్చేసారని అలాంటి పద్ధతి ఇక్కడ కూడా వస్తే బాగుంటుంది అని వెల్లడించాడు.