Salman Khan:సల్మాన్ ఖాన్ కి లైసెన్స్ గన్ జారీ చేసిన ముంబై పోలీసులు
Salman Khan issued gun license: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయుధ లైసెన్స్ ఇవ్వాలని ముంబై పోలీసులను గతనెలలో ఆశ్రయించాడు . ఈ మేరకు వ్యక్తిగత రక్షణ కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్ ప్రొమెనేడ్ వద్ద సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్‌ను ఉద్దేశించి బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే.
గత నెలలో గుర్తుతెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్‌ను మూసేవాలాను చంపిన తరహాలో చంపుతామని లేఖ రావడం కలకలం రేకింది. మే 29న మాన్సా గ్రామంలో పంజాబ్ గాయకుడు-రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలాను కాల్చి చంపారు. దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గా పేర్కొన్నారు. కెనడాలో ఉంటున్న బిష్ణోయ్ అసిస్టెంట్ విక్రమ్ బరడ్ బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు ఆమధ్య తెలిపారు.
మరణ బెదిరింపు నేపథ్యంలో ముంబై పోలీసులు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్వీయ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్‌ను జారీ చేశారు.ముంబై పోలీసు కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ దీనిని అందచేసాడు.