NTR: ‘బింబిసార’ ఈవెంట్‌లో ఎన్టీఆర్ టీ షర్ట్ ధరపై కామెంట్స్
Bimbisara Pre Release Event Ntr Wear T Shirt Price: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాతో మల్లిడి వశిష్ట్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్, వారినా హుసేన్ హీరోయిన్లుగా నటించారు.
సోసియో ఫాంటసీ గా అలాగే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న మూవీ ఇది. ఇందులో బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ అలరించబోతున్నాడు.అన్ని కార్యక్రమాలు ..కంప్లీట్ చేసుకున్న చిత్రం.. ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈమద్యే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
శిల్పకళావేదికలోగ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ వేసుకున్న టీ షర్ట్ గురించి అంత చర్చించుకుంటున్నారు.ఎన్టీఆర్ వేసుకున్న బ్లాకర్ కలర్ టీ షర్ట్ కార్ల్ లాగర్ ఫిల్డ్ కంపెనీ బ్రాండ్‌కు చెందింది. ఈ టీ షర్ట్ వెల రూ. 24 వేలు. దీంతో ఎన్టీఆర్ ధరించిన ఆ టీ షర్ట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.