Chiranjeevi: తన మొదటి లవ్ స్టోరీని బయట పెట్టిన మెగాస్టార్
Chiranjeevi Says He First Love Story: అమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఈ మద్యే నాగచైతన్య గురించి ఈ చిత్రంలో బాలరాజు గా కనిపించబోతున్నాడంటూ ఒక వీడియో ను విడుదల చేసింది యూనిట్. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు.
ఆగస్టు 11నఈ సినిమా విడుదలకానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నాడు. మూవీ విడుదల తేది దగ్గరపడనుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది యూనిట్.ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్యలను నాగార్జున ఇంటర్వ్యూ చేశాడు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఇంటర్వ్యూ ప్రొమోను విడుదల చేశారు. ఈ ప్రొమోలో చాలా విషయాలను పంచుకున్నారు యూనిట్.
మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అని చిరంజీవిని అమీర్ ఖాన్ అడిగితే చిరంజీవి ఏడో తరగతిలో ఉన్నప్పుడు అని చెప్పగానే మిగతా హీరోలు కొంచం షాక్ కి గురయ్యారు. చిన్నపుడు ఏడో తరగతిలో సైకిల్ తొక్కేటప్పుడు ఒక అమ్మాయి పట్టుకుంటే నేను సైకిల్ తొక్కేవాడిని. అప్పుడు సైకిల్ తొక్కడంపై ఉన్న ఇంట్రస్ట్ ను పక్కన పెట్టి ఆమెను చూసేవాన్ని. అప్పుడు ఆమె ముందు చూడు అంటూ నా ముఖాన్ని ముందుకు తిప్పేది’ అని తెలిపాడు.