Kajol: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న కాజోల్
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ సినిమాల్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ఓ వీడియో విడుదల చేసింది. తాను నటించిన కొన్ని హిట్ చిత్రాల క్లిప్పింగ్‌లతో కూడిన ఆ వీడియోతో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
1992లో కాజోల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే వంటి హిట్ చిత్రాలు ఆమె కెరీర్‌ను దూసుకుపోయేలా చేశాయి. కుచ్ కుచ్ హోతా హై సినిమా కూడా ఆమె కెరీర్‌లో ఓ మరపురాని మైలురాయి వంటిది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌తో ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. హిట్ పెయిర్‌గా వీరిద్దరికీ పేరు వచ్చింది. కొన్నేళ్ల పాటు వీరి జంట సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కభీ ఖుషీ కభీ గన్, మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేశాయి. వీరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
బాబీ డియోల్‌తో కలిసి చేసిన గుప్త్ సినిమా కూడా అప్పట్లో ఓ సంచలన విజయం నమోదు చేసుకుంది. కాజోల్‌లో నటనా ప్రతిభను సినీ ప్రపంచానికి చాటి చెప్పింది. అదే విధంగా అమీర్ ఖాన్‌తో కలిసి కాజోల్ నటించిన ఫనా చిత్రం భారత సినీ ప్రియులను ఎంతో గానో ఆకట్టుకుంది. కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. భర్త అజయ్ దేవ్‌గన్‌తో కలిసి నటించిన తన్హాజీ సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది.
కాజోల్ సినీ ప్రయాణం ప్రారంభించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భర్త అజయ్ దేవ్‌గన్ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తున్న ఓ ఫోటోను కూడా జత చేశాడు. సినిమాల్లోకి వచ్చి మూడు దశాబ్ధాలు. నీవు ఇప్పుడే నీ జర్నీ ప్రారంభినట్లుగా ఉంది. నీ జీవితంలో మరిన్ని మైలురాళ్లు ఉండాలని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ ముగించాడు.
Three decades in cinema! And, you are all fired up! Frankly, you’re just getting started. To many more milestones, movies & memories. pic.twitter.com/l1KHXvjiaz
— Ajay Devgn (@ajaydevgn) July 31, 2022