Jayasudha:పద్మశ్రీ పురస్కారాలకు తెలుగు హీరోయిన్లు పనికిరారా? జయసుధ
Jayasudha comments on Pamda Awards: సినీ పరిశ్రమలోకి అతి చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి, తన సహజ మైన నటనతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపుతెచ్చుకుంది…. అలనాటి స్టార్ హీరోయిన్ జయసుధ.హీరోయిన్ పాత్రలనుండి ప్రత్యేక పాత్రలద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీలో హీరోయిన్ల వివక్షపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
పక్క రాష్ట్రం నుంచి వచ్చే హీరోయిన్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారని.. తెలుగు హీరోయిన్లపై చిన్న చూపు ఉంటుందని అన్నారు. ఈ సందర్బంగా పద్మశ్రీ లాంటి పురస్కారాలకు తెలుగు హీరోయిన్లు గా మేము పనికిరామా? ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో ఏళ్ళనుండి నటనకే అంకితమయ్యారు.అయినా కూడా మాపై చిన్నచూపే అంటూ ప్రశ్నించారు. ముంబై హీరోయిన్ వస్తే మాత్రం ఆమె పెంపుడు కుక్కలకు కూడా నిర్మాతలు స్పెషల్ రూములు ఇస్తున్నారని విమర్శించారు.
50ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చూశానని చెప్పింది. జయసుధ తన కెరీర్ లో.. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు వంటి మొదటితరం హీరోలతో కలిసి నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. అనేక సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచింది.
హీరోలతో పోల్చితే హీరోయిన్లపై వివక్ష ఉందన్నారు. ఇటీవల కంగనా రనౌత్‌కి ‘పద్మశ్రీ’ పురస్కారం ఇచ్చిన నేపథ్యంలో ఆమెతో ప్రభుత్వానికి ఏం అవసరం ఉందో అంటూ సంచలనాలకు తెరలేపారు.
ఎప్పుడైనా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా, ఎక్కువగా ఇబ్బంది పెట్టినా ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండనిచ్చే వారు కాదని జయసుధ తెలిపారు. నటిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న కానీ ఒక్కరి నుండి కూడా విషెష్ లేదు. ఇన్నేళ్లు పూర్తి చేసుకుంటే బాలీవుడ్ లో అయితే కనీసం బొకే అయినా పంపించేవారని.. కానీ ఇక్కడ ఆ సంస్కారం లేదని విమర్శించారు. మరి జయసుధ కామెంట్స్ పై ఇతర నటీనటులు ఎలా స్పందిస్తారో చూడాలి.