Bimbisaara pre release event: నందమూరి అభిమానులకు ఫీస్ట్.. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
Bimbisaara pre-release event: నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బింబిసార. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ రూపొందిస్తున్న ఈ సినిమాలో భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్లలో భాగంగా ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ” ఒకరోజు కళ్యాణ్ అన్న ఫోన్ చేసి.... ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథను విన్నాను ఒక్కసారి నువ్వు వింటే బాగుంటుంది అని చెప్పినప్పుడు మొదలైన భయం సినిమా చూశాక తగ్గిందని అన్నారు. ఆ కథలో ఏం జరుగుతుందో తెలుసు నాకు.. ఇంత తెలిసిన నాకు ఈ సినిమా చూసినప్పుడు నేను గురైన ఎక్సయిట్మెంట్ ను.. థియేటర్ లో మీరు కూడా ఫీల్ అవుతారని అన్నారు. ఎమ్ఎమ్ కీరవాణి. సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్మ్యూజిక్ ను చూస్తే.. ఈ చిత్రానికి ఆయనే బ్యాక్ బోన్ అని అంటారు.. ఇక ఇదే స్టేజ్ మీద ఒక మాట అన్నాను.. మీకు నచ్చేవరకు సినిమాలు చేస్తూనే ఉంటామని.. మీరు కాలర్ ఎగరవేసే వరకు మేము చేస్తూనే ఉంటామని.. ఇప్పుడు ఈ స్టేజి పై చెప్తున్నాను.. ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ ఎక్కువ కాలర్ ను ఎగరేస్తారు. కళ్యాణ్ అన్న కెరీర్ బింబిసారకు ముందు బింబిసార తరువాత అని ఖచ్చితంగా అనుకుంటారు. ఇండస్ట్రీకి గడ్డుకాలం అంటున్నారు. థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదని అంటున్నారు కానీ ఇవన్నీ నేను నమ్మను. అద్భుతమైన సినిమా వస్తే.. చూసి ఆశీర్వదించే గొప్ప తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరందరూ అని పేర్కొన్నారు. బింబిసారను ఆదరిస్తారని, ఈ సినిమాతో పాటు సీతారామం సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు.మా తాత గారు.. నాన్న గారు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి” అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయనని తన ‘బింబిసార’ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఈ సినిమా చూసిన తర్వాత 100కి రెండు వందల శాతం మీరు తప్పకుండా శాటిస్ఫై అవుతారని తమ తాత నందమూరి తారక రామారావు పుట్టిన 100వ సంవత్సరంలో వస్తోన్న ఈ సినిమా ప్రతీ నందమూరి అభిమానిని గర్వపడేలా చేస్తుందన్నారు. తెలుగు సినిమాకి, తమ కుటుంబానికి మూల కారకుడైన ఆయనకు ఈ సినిమాను అంకితం చేస్తున్నానని కళ్యాణ్ రామ్ ఎమోషనల్ అయ్యారు.
"బింబిసార" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా విచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కళ్యాణ్ రామ్ వేడుకకు విచ్చేయగా, తాజాగా ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అభిమానుల కేరింతల మధ్య ఎన్టీఆర్ ఈవెంట్ లోకి అడుగు పెట్టాడు. అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ రాకతో ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత రెట్టింపయ్యింది.
హీరోయిన్లలో ఒకరయిన క్యాథరిన్ థెరిస్సా మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడం తన అదృష్టం అని పేర్కొన్నారు. చాలా ఏళ్ల తరువాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ లో చేస్తున్నానని, సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా అద్భుతంగా నటించారని అన్నారు. ఐరా పాత్రను నాకు ఇచ్చినందుకు వశిష్ట్ కు థాంక్స్ చెబుతున్నానని ఆమె అన్నారు. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని అన్నారు.
నందమూరి హీరోలు ఎంతగానో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అభిమానులు, నందమూరి శ్రేయోభిలాషులు కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.
సినిమాటోగ్రఫర్ ఛోటా కె నాయుడు మాట్లాడుతూ.. కళ్యాణ్ రామ్ సినిమాలో చాలా బాగా నటించాడు. అంతకు ముందు మీరు చూసిన కళ్యాణ్ రామ్ వేరు.. బింబిసారలో కళ్యాణ్ రామ్ వేరు. సినిమాలో కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూపించాడు. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ చింపి పడేశాడు. ఒక సీన్ గురించి వివరిస్తూ ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ యాంకర్ గా వ్యవహరిస్తోంది. బింబిసార డైలాగ్స్ తన స్టైల్లో చెప్తూ నందమూరి అభిమానులను ఉత్తేజపరుస్తూ టీజర్, ట్రైలర్ ను మరోసారి అభిమానులకు చూపడంతో మరింత కేరింతలు కొడుతున్నారు అభిమానులు.