Mohan Babu: ప్రొఫెసర్ విశ్వామిత్ర గా మోహన్ బాబు
Mohan Babu First Look Released from Agni Nakshatram : మంచు లక్ష్మి నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ , మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేసారు చిత్ర యూనిట్. తాజాగా మోహన్ బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో ప్రొఫెసర్ విశ్వామిత్ర గా నటిస్తున్నాడు మోహన్ బాబు.
ప్రొఫెసర్ విశ్వామిత్ర క్యారెక్టరైజేషన్ లో గంభీరమైన లుక్ తో మోహన్ బాబు డిఫరెంట్ క్యారెక్టర్ తో ఈ సినిమాలో అలరించబోతున్నారని లుక్ ని చూస్తే అర్ధమవుతోంది. మొదటిసారి మోహన్ బాబు, మంచు లక్ష్మీ కలిసి తెర పంచుకుంటున్న ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర చేస్తున్నాడు. అలాగే మలయాళ నటుడు సిద్దిక్ విలన్ గా ఇందులో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నాడు.
ఈ ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన మోహన్ బాబు ఆసక్తికరమైన కామెంట్ చేసాడు. నా కూతురు నిర్మిస్తూ నటిస్తున్న
‘అగ్ని నక్షత్రం’లో తనతో మొట్టమొదటిసారి ప్రొఫెసర్ విశ్వామిత్ర గా నటిస్తున్నాను.భయం భయంగా ఉంది. అంటూ పోస్ట్ చేసాడు.
నా కూతురు నిర్మిస్తూ నటిస్తున్న
‘అగ్ని నక్షత్రం'లో తనతో మొట్టమొదటిసారి ప్రొఫెసర్ విశ్వామిత్ర గా నటిస్తున్నాను.
భయం భయంగా ఉంది. pic.twitter.com/keE6cbJHgh— Mohan Babu M (@themohanbabu) July 31, 2022