Stock Markets: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Stock Markets Update: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం 9 గంటల 28 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 246 పాయింట్ల లాభంతో 57,816 వద్ద ట్రేడవుతోండగా.. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 17,239 వద్ద కొనసాగుతోంది. ఆసియా-పసిఫిక్ సూచీలు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. జులైలో చైనా తయారీ కార్యకలాపాలు నెమ్మదించాయన్న నివేదిక ఆసియా మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసింది. నేడు జులై నెల జీఎస్టీ వసూళ్ల వివరాలు వెలువడనున్నాయి. మరోవైపు ఈ వారంలో ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష కూడా ఉంది. కమొడిటీ ధరలు శాంతిస్తున్నందున, జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గడంతో ఆర్‌బీఐ రేట్ల పెంపుపై దూకుడుగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 79.13 రూపాయల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, మారుతీ, పవర్‌గ్రిడ్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటన్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.