Mahesh Babu: కొత్త బిజినెస్ లోకి మహేష్ బాబు.. పెద్ద ప్లానే ఇది!
Mahesh Babu into Restaurant Business: మన హీరోలు చాలా మంది రకరకాల బిజినెస్ లు చేస్తూ ఉంటారు. ఇప్పటికే రెస్టారెంట్ బిజినెస్ లో టాలీవుడ్ కి సంబంధించి చాలా మంది హీరోలు అలాగే ఇతర సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ లోకి మహేష్ బాబు కూడా దిగబోతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి మహేష్ బాబు మినార్వా గ్రూప్ తో కలిసి ఒక భారీ బడ్జెట్ రెస్టారెంట్ ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్ ఏరియాలో ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే చివరిగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభమవుతుందని సినిమా నిర్మాణ సంస్థ హారిక హాసిని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా పూర్తయి విడుదలైన తర్వాత ఆయన మహేష్ బాబుతో రాజమౌళి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. ఇక మహేష్ రాజమౌళి సినిమా మీద ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.