Ola and Uber in merger talks : ఓలాలో ఉబర్ విలీనం కాబోతోందా?
అయితే ఈ వార్తలను ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తోసిపుచ్చారు. “ఈ వార్తలు పూర్తిగా అర్ధంలేనివి. మాది లాభాలు ఆర్జించే కంపెనీ. మరేదైనా కంపెనీ వ్యాపారం నుండి నిష్క్రమించాలనుకుంటే అది స్వాగతించదగినదే. కాని మేము ఎప్పటికీ విలీనం కాబోము” అని స్పష్టం చేశారు. అయితే ఇండియాలో క్యాబ్ కంపెనీలు ఉబెర్, ఓలా రెండూ ఒకదానితో ఒకటి గట్టిగానే పోటీ పడుతున్నాయి. క్యాబ్ డ్రైవర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు, ప్రయాణీకులకు డిస్కౌంట్ ఇవ్వడం వంటి వాటి కోసం రెండు కంపెనీలు బిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు. దీనికి సంబంధించి ఉబర్ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఉబర్ భారత్ లో క్లోజ్ అంటూ వస్తున్న వార్తలను మాత్రం ఖండించింది.
ఇదిలా ఉండగా ఉబర్ తన స్థానిక ఫుడ్ డెలివరీ వ్యాపారమైన ఉబర్ ఈట్స్‌ను జనవరి 2020లో జొమాటో కు విక్రయించింది. మరోవైపు ఓలా తన కిరాణా డెలివరీ వ్యాపారాన్ని మూసివేసింది. ఇటీవలే ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టారు.