Andhra Pradesh: మద్యపానం మా మేనిఫెస్టోలో లేదు గుడివాడ అమర్‌నాథ్
AP Minister Gudivada Amarnath:ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రమంతటా నిరసనలు వ్యక్తం చేస్తున్నవేళ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధం అన్న మాటే తమ మేనిఫెస్టోలో లేదన్నారు. తాము మద్యనిషేధం చేస్తామని ఎప్పుడు.. ఎక్కడ చెప్పలేదని ఎక్కడైనా చెప్పామా? మేము అని తెలుగుదేశం పార్టీ సభ్యులను ప్రశ్నించారు. ఎక్కడైనా అని ఉంటే చూపించాలని సవాల్ చేశారు.
మా ప్రభుత్వం మద్యనిషేధం చేస్తామని చెప్పలేదని.. ధరను స్టార్ హోటళ్లలో ఉన్నట్లుగా ధరలు పెంచుతామని మాత్రమే చెప్పామన్నారు అలాగే చేశామని అన్నారు. ఇప్పుడు తాగేవాళ్లు తగ్గారు.. ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లినా తమ మేనిఫెస్టో గోడల మీద ఉంటుంది.. కావాలంటే వెళ్లి చూసుకోవచ్చని మంత్రి సూచించారు.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 4500 వైన్ షాప్స్ ఉండగా.. ఆ సంఖ్యను 2900కి కుదించాం.. మద్యపాన నిషేధానికి సంబంధించి 0.25 మార్కులే వేసుకున్నామని మంత్రి చెప్పారు.
ఒకవైపు తగ్గిస్తున్నామని చెపుతూనే బార్ల పాలసీని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఏకంగా మూడేళ్లకు లైసెన్సులు ఇచ్చే విధంగా ఆన్ లైన్ వేలం నిర్వహిస్తుంది. ఈ కారణంగా మద్యనిషేధం హామీపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా తాము మద్య నిషేధహామీని అసలు ఇవ్వలేదని చెబుతూండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.