Kishan Reddy: మచ్చలేని ప్రభుత్వం మాది
ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా KL యూనివర్సిటీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా వచ్చారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండాకు ప్రాణం పోసింది కృష్ణా జిల్లా అని కొనియాడారు. 2014 లో సమర్థవంతమైన నాయకుడు దేశానికి కావాలని మోదీని ఎన్నుకున్నారని, మోదీ నాయకత్వంలో ఒక్క అవినీతి మరక లేకుండా పాలన సాగుతోందని కిషన్ రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వంలో 12 కోట్ల కుంభకోణాలు జరిగాయని, రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్ ఉండేవారని అందరికి తెలుసునని కిషన్ రెడ్డి అన్నారు. పని విషయంలో ప్రధాని మోడీ మా అందరికీ నరకం చూపిస్తారని, తాను కూడా 8 సంవత్సరాలుగా ఒక్క సెలవు లేకుండా పని చేస్తున్నారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ప్రధాని మోడీ తన పుట్టిన రోజును సైనికులతో జరుగుపుకుంటారని గుర్తుచేశారు. జి-20 సమావేశాల్లో గత ప్రభుత్వ ప్రధాని ఎక్కడో కని కనిపించని స్థానంలో కూర్చునేవారని, కానీ మోడీ స్థానం ఎక్కడో అందరికీ తెలుసునని కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు తలెత్తుకుని తిరుగుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. పనిలో పనిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కూడా కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ 10 రోజులు ఇంట్లో, మరో 20 రోజులు ఫామ్ హౌస్‌లో ఉంటారని, సచివాలయానికి ఒక్క రోజు కూడా రారని విమర్శించారు.
ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలోనే జరుగుతుందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పటి వరకు 100 దేశాలకు కరోనా వాక్సిన్ అందించామని, అమెరికా కూడా మన కరోనా వాక్సిన్ కావాలంటుందని తెలిపారు.
ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య యుద్ధం ఆపిన ఘనత కూడా ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని కిషన్ రెడ్డి అన్నారు. అదే విధంగా పాకిస్తాన్‌పై రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్ చేసి దేశ సత్తాను చాటామని కూడా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. బీజేపీ ముస్లింలకు ఎప్పుడూ వ్యతిరేకంగా కాదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 80 శాతం మంది ముస్లింలు ఉన్న ప్రాంతంలో బీజేపీ గెలిచిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
Attended and addressed at 'Modi@20: Dreams Meet Delivery', a symposium for introduction of a book on the political journey of our Prime Minister Shri @narendramodi ji.
Spoke on the Narendra Modi ji’s governance model which has grown stronger with every new challenge. pic.twitter.com/bh1yYtPoSO
— G Kishan Reddy (@kishanreddybjp) July 31, 2022