TTD: టీటీడీకి విరాళాల వెల్లువ.. రెండేళ్లలో 1,606 కోట్ల రూపాలయను అందించిన భక్తులు
Tata Company has Announced a Donation of 120 crores to TTD: తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్ట్‌కు విరాలాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకాలం స్వామివారికి మాత్రమే కానుకలు చెల్లించిన భక్తులు.. ఇప్పుడు టీటీడీకి కూడా విరాళాలు సమర్పిస్తున్నారు. కరోనా సమయంలో కూడా భక్తులు టీటీడీ ట్రస్ట్‌కు విరాళాలు అందించేందుకు పోటీపడ్డారు. గత రెండు సంవత్సరాల్లో టీటీడీకి 1,606 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సకల సౌకర్యాలు కల్పించటంలో దాతల సహకారం కూడా ఉంది.
మరోవైపు 2019 మే 25న దేశ వ్యాప్తంగా ఆలయాలను నిర్మిస్తున్నట్లు, పాత ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీటీడీ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఆలయాలను నిర్మిస్తున్న ఈ ట్రస్ట్.. తిరుమలలో భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఇతర ప్రాంతాల్లో ఆలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఇటీవలే తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధికి టాటా గ్రూప్ ముందుకు వచ్చింది. దీనికోసం దాదాపు 120 కోట్ల రూపాలయను విరాళంగా ఇచ్చింది. ఇలా సామాన్య భక్తుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు టీటీడీకి విరాళాలు అందుస్తున్నారు. టీటీడీ ట్రస్ట్ దేశ వ్యాప్తంగా దేవాలయాలను నిర్మిస్తుంది.