Kishan Reddy: అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
పింగళి వెంకయ్య స్వగ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. కిషన్ రెడ్డి వచ్చే సమయానికి జాయింట్ కలెక్టర్ వెళ్లిపోవడంతో ఆయనకు కోపం వచ్చింది. అక్కడే ఉన్న ఆర్డీఓపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారి వేడెక్కింది.
అంతకు ముందు పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి కలిశారు. వారితో ముచ్చటించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భట్ల పెనుమర్రు గ్రామం జాతీయ జెండాకు ప్రాణం ఇచ్చిందని అన్నారు. సూర్య, చంద్రులు వున్నంత వరకు జాతీయ జెండా వుంటుందని అన్నారు. ఆగస్టు 2న పింగళి వెంకయ్య స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తామని వెల్లడించారు.
ఆగస్టు15 వ తేదీన 75వ స్వాతత్ర్యదినోత్సవ ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా పింగళి వెంకయ్యను మరిచిపోతే చరిత్ర మనలను క్షమించదని కిషన్ రెడ్డి అన్నారు. పల్లె నుంచి పట్నం వరకు ఆగస్టు 15న జాతీయ జెండా భారతీయుడి ఇంటి మీద ఎగురాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 2 న పింగళి వెంకయ్య జన్మదినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ గ్రామానికి మంచి రోడ్లు వేయిస్తానని మాట ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే తానే రోడ్డు వేయిస్తానంటూ భరోసా ఇచ్చారు. గ్రామంలో పింగళి వెంకయ్య స్మారక కేంద్రం కడతామని కూడా ప్రకటించారు.
Paid tributes to Shri Pingali Venkayya garu – the designer of Indian national flag at his birth place, Bhatla Penumarru village, Machlipatnam in Andhra Pradesh. pic.twitter.com/VYiydzMP4H
— G Kishan Reddy (@kishanreddybjp) July 31, 2022